ఈ చిన్నది స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు హిందీ సినిమాలలో ఎన్నో సూపర్ హిట్ పాటలతో తన అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త రంగంలో అడుగు పెట్టింది. సినీ ప్రపంచంలో గ్లామర్‌తో అద్భుతమైన గుర్తింపు పొందిన ఈ హాట్ హన్మాండి ఇప్పుడు హారర్ కామెడీ చిత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు హారర్ కామెడీ సినిమాల కోసం ఎంతో ఇష్టపడే ప్రేక్షకులకు “కాంచన” ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న సినిమా.
![కాంచన 4 మూవీలో బాలీవుడ్ బ్యూటీ](https://thevaartha.com/wp-content/uploads/2025/02/కాంచన-4-మూవీలో-బాలీవుడ్-బ్యూటీ-1024x576.webp)
ఈ సినిమాకు వేరే ఫ్యాన్ బేస్ కూడా ఉందని చెప్పవచ్చు థియేటర్లలో రచ్చ చేసి అంగీకారాన్ని అందుకున్న ఈ సినిమా తరువాతి భాగాలు వచ్చినప్పుడు ప్రేక్షకుల స్పందన చూసి నిర్మాతలు ఆనందం చెందారు.కాంచన 1, 2, 3 చిత్రాలు ప్రేక్షకులను నవ్విస్తూనే అద్భుతమైన విజయం సాధించాయి.ఇప్పుడు “కాంచన 4” రాబోతుంది ఈ చిత్రంలో ఒక పెద్ద మార్పు కనిపించబోతుంది. ఇంతవరకు, ఈ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే కనిపించాయి కానీ ఈసారి బాలీవుడ్ బ్యూటీ జాయిన్ కానుంది.
అబ్బ ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా ఇంకెవరు నోరా ఫతేహి హఠాత్తుగా ఈ క్రేజీ బ్యూటీ హారర్ కామెడీ మూవీలో ఎలా ఉంటుంది అనే ఆసక్తి పుట్టించడమే.హీరోయిన్ల నుంచి ప్రత్యేక పాటలకు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నోరా ఈ చిత్రంలో తన కొత్త క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. ఈ సినిమాను హైదరాబాద్ లో షూట్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో “దిల్బర్” పాటతో పాన్ ఇండియా స్థాయిలో అగ్ర కథానాయికగా గుర్తింపు పొందిన నోరా, తన గ్లామర్, డాన్సింగ్ టాలెంటుతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు.ఇంతలో నోరా ఇప్పటివరకు హిందీ, ప్రేక్షకులను అలరించింది ఇప్పుడు “కాంచన 4″లో భాగం కావడం ఈ బ్యూటీకి మరింత గుర్తింపు తీసుకొస్తుంది.