click here for more news about Tollywood
Tollywood పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ అయిన చిత్రం మన ముందుకు వచ్చింది. అంచనాలు లేకుండా విడుదలై, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించి, ఏకంగా రూ.400 కోట్ల పైగా వసూలు చేసింది. ఇప్పుడు, ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రం మూడు సంవత్సరాల క్రితం విడుదలై, అంచనాలు లేకుండా వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది.దక్షిణాదిలో ఒక పెద్ద విజయం అందుకున్న సినిమా ఇది.₹16 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తో నిర్మించి, ₹400 కోట్ల పైగా రాబట్టి రికార్డ్ సృష్టించింది.ఈ సినిమా మనిషి, ప్రకృతి మధ్య జరిగే సంఘర్షణను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు.చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ పొందింది. ఈ సినిమా పేరు.”కాంతార”.
కర్ణాటక గిరిజన వర్గాల సంప్రదాయాలను,నమ్మకాలను కేంద్రంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.2022లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ భారీ విజయాన్ని సాధించింది.దీంతో ఇప్పుడు సినిమా సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి అద్భుతంగా నటించి ప్రశంసలు పొందారు. రిషబ్ శెట్టి ఈ సినిమాకి రచన, దర్శకత్వం కూడా వహించారు.మౌత్-ఆఫ్-మౌత్ ప్రకటనల ద్వారా ఈ సినిమా కలెక్షన్లు వేగంగా పెరిగాయి. కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో విడుదలై, భారతదేశంలో ₹310 కోట్ల వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ₹408 కోట్ల వసూలు చేసి రికార్డు నెలకొల్పింది.ఈ సినిమాలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్, మానసి సుధీర్, అచ్యుత్ కుమార్, స్వరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.