Click Here For More Tollywood Movies News
tollywood , 1000 కోట్ల వసూళ్లు ఒకప్పుడు అద్భుతంగా భావించేవి కానీ ఇప్పుడు అది సాధ్యమవడం చాలా సులభం అయిపోయింది. ఈ రోజుల్లో 1000 కోట్లు సాధించడం అంటే టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలకు ఇది చాలా సాధారణమైన విషయం. ప్రస్తుతం మనం చూసే భారీ వసూళ్లలో తదుపరి 1000 కోట్లు సాధించే సినిమా ఏది? అది సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలా లేక బాలీవుడ్ నుండి ఎవరైనా ముందుకు వస్తారా ఇది చూస్తే మరింత ఆసక్తిగా మారుతుంది.పుష్ప 2 సూపర్ హిట్‌గా నిలిచిన తర్వాత 1000 కోట్ల వసూళ్ల సాధించడం మరింత సాధ్యమైన విషయంగా మారింది.
ఈ సినిమా మొదటి 6 రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు బాహుబలి 2, కేజియఫ్ 2, RRR, జవాన్, పఠాన్, కల్కి వంటి సినిమాలు మాత్రమే ఈ అద్భుతమైన ఘనత సాధించాయి. ఇందులో 2 బాలీవుడ్ సినిమాలు, 4 టాలీవుడ్ సినిమాలు ఉన్నాయి.ప్రస్తుతం బాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాల్లో వార్ 2 మాత్రమే 1000 కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉన్న సినిమా. ఎన్టీఆర్ ఉన్నందున, సౌత్‌లో ఈ సినిమాకు మంచి స్పందన రాబడుతుందని ఆశించవచ్చు.
హృతిక్ రోషన్ ఉన్నందున హిందీ ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అంతేకాకుండా దేవర మరియు ట్రిపుల్ ఆర్‌తో భారీ ఫ్యాన్స్ . ఈ కారణంగానే, వార్ 2 1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి.వారే 2 మినహాయిస్తే, ఇక 1000 కోట్లు వసూలు చేసే సినిమా రేసులో, సౌత్ ఇండస్ట్రీనే ముందంజలో ఉంది. కన్నడ సినిమాలు ముఖ్యంగా కాంతార 2 మరియు యశ్ టాక్సిక్ కూడా ఈ రేసులో ఉన్నాయి. ప్రభాస్ ఫౌజీకి 1000 కోట్లు సాధించడం కష్టమేమీ కాదు పాజిటివ్ టాక్ వచ్చినా, 1500 కోట్లు కూడా రావచ్చు.