click here for more news about Technology
Technology ఈ నెల 14వ తేదీన ఢిల్లీకి చెందిన అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ క్రైమ్ సమ్మిట్-2025 జరిగింది. ఈ సమ్మిట్‌ను ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ (FCRF) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో, సైబర్ భద్రతా నిపుణులు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు రక్షణ సిబ్బంది సైబర్ న్యాయవాదులు నిఘా అధికారులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.సమాజంలో టెక్నాలజీ ఆధారిత నేరాలు పెరిగిపోతున్న వేళ వాటిని అరికట్టడానికి తగిన చర్యలు ఏంటనే అంశంపై ఈ సమ్మిట్‌లో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో డిజిటల్ బెదిరింపులను ఎలా ఎదుర్కోవాలి, సైబర్ నేరాలపై కొత్త ఫోరెన్సిక్ ఆవిష్కరణలు ఎంటో, టెక్నాలజీ ఆధారిత నేరాలపై నియంత్రణ చర్యలపై వివరాలు ఇచ్చారు.
ఫ్యూచర్ క్రైమ్ సమ్మిట్‌లో ProDiscover సంస్థ యొక్క నూతన ఆవిష్కరణ ‘ProDiscover FlexKey’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సాంకేతికత సైబర్ నిపుణులు, ఫోరెన్సిక్ దర్యాప్తులను ఎలా క్రమబద్ధీకరిస్తుందో చర్చించారు. ‘ProDiscover FlexKey’ నెట్‌వర్క్ ఆధారిత లైసెన్స్ నిర్వహణ వ్యవస్థగా పనిచేస్తుంది. ఇది ఫోరెన్సిక్ నిపుణులు అవసరమైన వనరులను సజావుగా పంచుకునేలా వాడని వనరులను తొలగించి, వ్యవస్థను సమర్థవంతంగా ఉంచుతుంది.ఈ కార్యక్రమంలో ProDiscover సంస్థ యొక్క సీఈఓ నృపుల్ రావు తమ సంస్థ అభివృద్ధి చేసిన ఫోరెన్సిక్ సాధనాలను లైవ్ లో ప్రదర్శించారు.
డిస్క్ ఇమేజింగ్, లైవ్ మెమరీ విశ్లేషణ, డేటా రికవరీ, అధునాతన రిపోర్టింగ్ వంటి ఆవిష్కరణలు సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో కీలకంగా పనిచేస్తాయి.సమ్మిట్‌లో, సైబర్ నిపుణులు, డిజిటల్ ఇన్వెస్టిగేషన్లలో కొత్త సైబర్ ప్రమాదాలు, దర్యాప్తు పద్ధతులపై లోతైన అవగాహనను పంచుకున్నారు. ProDiscover సంస్థ వారి సాంకేతికతను ‘మేక్ ఇన్ ఇండియా’ పంథాలో అభివృద్ధి చేస్తూ, హైదరాబాద్‌లో తమ ఫోరెన్సిక్ సాధనాలను మరింత మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించింది.