south africa vs pakistan కరాచీ నేషనల్ స్టేడియంలో పరుగుల వర్షం!పాకిస్తాన్ విజయం
south africa vs pakistan బుధవారం, కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగిన ట్రై-సిరీస్ వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనిపించింది.మొత్తం 99 ఓవర్లలో 707 పరుగులు వచ్చాయి,రెండు జట్లు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాయి.
హెయిన్‌రిచ్ క్లాసెన్ (87), మాథ్యూ బ్రెట్జ్కీ (83) మరియు కెప్టెన్ టెంబా బవుమా (82) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో దక్షిణాఫ్రికా 352/5 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది.అయితే, పాకిస్తాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో గెలిచింది.సల్మాన్ అలీ అఘా (134) మరియు కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ (122*) అద్భుతమైన శతకాలతో ప్రత్యర్థి బౌలర్లను నిలువరించారు.
ఈ విజయంతో పాకిస్తాన్ ట్రై-సిరీస్ ఫైనల్‌కు చేరుకుంది, ఇది శుక్రవారం న్యూజిలాండ్‌తో జరగనుంది.ఇప్పటి వరకు జరిగిన మ్యాచులు చూస్తే, రాబోయే ICC ఛాంపియన్స్ ట్రోఫీ భారీ స్కోర్లతో రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.ఈ ట్రై-సిరీస్ కోసం లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియం మరియు కరాచీ నేషనల్ స్టేడియంలను వేదికలుగా ఉపయోగించారు.ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మరో మైదానం రావల్పిండిలోని క్రికెట్ స్టేడియంగా నిర్ణయించారు.ట్రై-సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు లీగ్ మ్యాచులలో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన జట్లు 300+ స్కోర్ చేయడం గమనార్హం.లాహోర్‌లో న్యూజిలాండ్ 330/6 స్కోర్ చేయగా,దక్షిణాఫ్రికా 304/6 స్కోర్ చేసింది.కరాచీలో జరిగిన మ్యాచ్‌లో 7.14 పరుగుల రన్‌రేట్ నమోదవ్వడం, ఫైనల్‌లో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశాన్ని పెంచింది.
దక్షిణాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ, “బ్యాట్స్‌మెన్ తమ ఆటతీరు బాగా మెరుగుపర్చుకున్నారు.అయితే, బౌలర్లుగా మేము మరింత ఒత్తిడి కల్పించి, వికెట్లు తీయడానికి కొత్త వ్యూహాలు రూపొందించాలి” అని అన్నారు.అలానే,పిచ్‌లు ఇవే విధంగా ఉంటే, భవిష్యత్తులో 350+ స్కోర్లు సాధారణం అవుతాయని అభిప్రాయపడ్డారు.“ఈ పిచ్‌లపై బౌలర్లు కొత్త విధానాలను అనుసరించాల్సి ఉంటుంది.