click here for more news about sankranthiki-vasthunam
sankranthiki-vasthunam సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఈ సినిమా థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్గా నిలిచింది.ఇప్పుడు ఈ చిత్రాన్ని జీ5 మరియు జీ తెలుగు రెండింటిలో కూడా రేపు (మార్చి 1) ఏకకాలంలో ప్రీమియర్‌గా చూపించనున్నారు.కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను నవ్వించేందుకు ‘సంక్రాంతికి వస్తున్నాం’మూవీ మార్చి 1,సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు మరియు ZEE5లో ప్రీమియర్ అవుతుంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, జీ తెలుగు చానెల్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది.ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “సంక్రాంతికి వస్తున్నాం సినిమా నాకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ఈ చిత్రంలో వెంకటేశ్ ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి,ఉపేంద్ర లిమాయే అద్భుతంగా నటించారు.
సినిమా ప్రేక్షకుల్ని ప్రారంభం నుండి ముగింపు వరకు ఎంటర్టైన్ చేస్తుంది. ZEE5 మరియు ZEE తెలుగు ద్వారా ఈ చిత్రం అందరికీ చేరుకుంటోంది. ఇది ప్రతి ఒక్కరూ ఆనందంగా చూస్తారు” అని అన్నారు.విక్టరీ వెంకటేశ్ సినిమా గురించి మాట్లాడుతూ, “సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో రాజు పాత్ర చేయడం చాలా ఆనందం. అతని జీవితం సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా సాగుతుంది.ఈ స్క్రిప్ట్ పూర్తిగా ప్రజలను నవ్విస్తుంటుంది.థియేటర్లలో ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది. ఇప్పుడు ZEE5 మరియు ZEE తెలుగు ద్వారా ఈ చిత్రం మరింత మంది ప్రేక్షకులకు చేరుకుంటోంది. కుటుంబ సభ్యులతో చూసే చిత్రమిది” అని చెప్పారు.ఐశ్వర్య రాజేష్ ఆమె పాత్ర గురించి మాట్లాడుతూ, “భాగ్యలక్ష్మి పాత్ర నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది. ఆమె పాత్రలో అమాయకత్వం మరియు పొసెసివ్‌నెస్ రెండూ ఉన్నాయి.ఈ పాత్రను వెంకటేశ్ గారి పక్కన పోషించడం చాలా ఆనందంగా ఉంది.