click here for more news about Revanth Reddy
Revanth Reddy ప్రధాని మోదీ నిజంగా బీసీనా ఆయన లీగల్‌గా బీసీ జాబితాలోకి ఎప్పుడూ చేరారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆయన కన్వర్టెడ్ బీసీ అని చెప్పి రాజకీయ దుమారం రేపారు.ప్రధాని బీసీ అంటూ చెప్పుకుంటారని, కానీ వాస్తవానికి ఆయన బీసీ వ్యతిరేకి అని తీవ్ర విమర్శలు చేశారు.దీంతో బీజేపీ నేతలు రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కుల రాజకీయాలు ఎప్పటికీ ఆగడం లేదు.ఇటీవల బీసీ కులగణన సర్వే నివేదికలో బీసీల సంఖ్య తగ్గించి చూపారని రచ్చ రేగింది. ఇక ఎస్సీ వర్గీకరణపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఇప్పుడు ఆ వివాదంలో దేశ ప్రధానిని లాగి, సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్ గాంధీభవన్‌లో జరిగిన కులగణన,ఎస్సీ వర్గీకరణపై నిర్వహించిన ప్రెజెంటేషన్‌లో ప్రధాని మోదీపై నేరుగా విమర్శలు గుప్పించారు.2002 వరకు మోదీ ఉన్నత కులానికి చెందినవారని, గుజరాత్ సీఎం అయిన తర్వాతే బీసీ జాబితాలో చేర్చారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన తప్పుడు మార్గాల్లో బీసీగా మారారని ఆరోపించారు. అధికారిక ధృవీకరణ ప్రకారం మోదీ బీసీ అయినా, ఆయన ఆచరణలో మాత్రం అగ్రకుల వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
బీసీలకు న్యాయం చేయాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే డిమాండ్ చేశారు.మోదీ నిజమైన బీసీ అయితే, కులగణనను ఎందుకు అంగీకరించరని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కులగణనపై మౌనం పాటించడం బీసీలకు వ్యతిరేకమేనని ఆరోపించారు.రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. 1994లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ కులాన్ని బీసీల జాబితాలో చేర్చిందని, ఆయన సీఎం కావడానికి ముందు నుంచే బీసీ జాబితాలో ఉన్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు.