click here for more about Narendra Modi
Narendra Modi భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికాకు చేరుకున్నారు ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు.ఇది ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ కలిసిన తొలి అవకాశం.ఈ భేటీలో ట్రేడ్, సుంకాలు, ఇమిగ్రేషన్, మరియు ఇరుదేశాల మధ్య సంబంధాల వంటి అనేక కీలక అంశాలపై చర్చలు జరిగాయని సమాచారం.ప్రధాని మోదీ వెంట భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభల్ కూడా ఉన్నారు.ఈ భేటీ అనంతరం ఇద్దరు దేశాధినేతలు విలేకరులతో మాట్లాడారు.మోదీ మాట్లాడుతూ “శ్వేత సౌధంలో మళ్లీ ట్రంప్‌ను చూడటం ఆనందంగా ఉంది.140 కోట్ల భారతీయుల తరపున ఆయనకు శుభాకాంక్షలు. మళ్లీ నాలుగేళ్ల పాటు ట్రంప్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.ప్రపంచ అగ్రరాజ్యం ప్రయోజనాల కోసం ట్రంప్ పనిచేస్తారు. అలాగే, నేను కూడా భారతదేశ ప్రయోజనాల రక్షణకు కృషి చేస్తాను.భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపర్చుతాం” అని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ “భారత్‌కు నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఉండటం చాలా గర్వకారణం. మోదీ నాకు చాలా సంవత్సరాలుగా మంచి మిత్రుడు.మా స్నేహం రాబోయే నాలుగేళ్లపాటు కొనసాగుతుంది.భారత్ మరియు అమెరికా మధ్య గొప్ప ఐక్యత ఉంది. ఈ ఐక్యతను కాపాడడం చాలా ముఖ్యమైంది.ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మాకు చమురు వనరులు అందుబాటులో ఉన్నాయి.ఆ వనరులు భారతదేశానికి అవసరం మేము ఎవరినీ ఓడించాలని అనుకుంటున్నాం లేదు. కానీ, అమెరికా ప్రజల కోసం అద్భుతమైన పనులు చేస్తాం.భారత్‌తో మా స్నేహాన్ని కొనసాగిస్తాం ఇందులో ఎటువంటి మార్పు ఉండదు” అని అన్నారు.ఈ భేటీ ద్వారా భారత్-అమెరికా సంబంధాలు బలపడతాయని రెండు దేశాలు కొత్త బంధాలను ఏర్పరచుకునే అవకాశం ఉందని పలు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.