click here for more news about Mrithyunjay
Mrithyunjay శ్రీ విష్ణు కొత్త సినిమా ‘మృత్యుంజయ్‘ థ్రిల్లింగ్ టీజర్ విడుదల సినిమా ప్రపంచంలో తనదైన గుర్తింపు సంపాదించిన యంగ్ హీరో శ్రీ విష్ణు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.విభిన్నమైన కథలు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగా ప్రాజెక్టులు ఉండగా, వాటిలో ‘మృత్యుంజయ్’ ఒకటి. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు.రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రెబా జాన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీ విష్ణు బర్త్‌డే స్పెషల్ ‘మృత్యుంజయ్’ టీజర్ విడుదల శుక్రవారం శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే ఇది ఒక సస్పెన్స్, థ్రిల్ మరియు ఎమోషన్ కలబోసిన చిత్రమనే విషయం స్పష్టమవుతోంది. “గేమ్ ఓవర్ జయ్” అనే డైలాగ్ వాయిస్ ఓవర్‌లో వినిపించగా, కథలో మిస్టరీ ఇంకా పెరిగింది. టీజర్‌లో శ్రీ విష్ణు రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు ఒకటే ఇన్వెస్టిగేటర్, మరొకటి ఖైదీ.
ఈ క్యారెక్టర్ డ్యూయాలిటీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనుందని అర్థమవుతోంది. ముఖ్యంగా టీజర్ చివర్లో “నేను చెప్పే వరకు గేమ్ ఫినిష్ కాదు” అనే పవర్‌ఫుల్ డైలాగ్ కథానాయకుడి క్యారెక్టర్‌కు మరింత ఉత్కంఠను జోడించింది.టెక్నికల్ టీమ్ సక్సెస్‌కు మరో అస్త్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అద్భుతమైన విజువల్స్ అందించడానికి విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కలభైరవ సంగీతం అందిస్తున్నాడు. సినిమా కట్ పరంగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకోగా, మనీషా ఎ.దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు.