click here for more Movie News
Movie News:- తమిళంలో వచ్చిన ‘కాదలిక్క నేరమిల్లై‘ సినిమా,రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందింది. ఈ సినిమాను కృతిగ ఉదయనిధి దర్శకత్వం వహించారు. రవి మోహన్ and నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 జనవరి 14న థియేటర్లలో విడుదల కాగా ,ఇప్పుడు ‘నెట్ ఫ్లిక్స్’లో తెలుగులో అందుబాటులోకి వచ్చింది. శ్రియ (నిత్యామీనన్) ఒక ఆర్కిటెక్ట్. చెన్నైలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుంది. ఆమె స్వతంత్ర భావాలు తన మనసుని అనుసరించే విధానం ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆమె ప్రేమలో ఉంటారు కరణ్ (జాన్ కొక్కెన్)తో. కానీ నిశ్చితార్థం తరువాత కరణ్ యొక్క నిజస్వరూపం తెలిసి ఆమె అతనితో దూరం అవుతుంది.
ఇక సిద్ధార్థ్ (రవి మోహన్) బెంగుళూరులో ఆర్కిటెక్ట్ గా పని చేస్తున్నాడు. అతనికి స్నేహితులు గౌడ ( మరియు సేతు . ఒక సందర్భంలో సేతుతో వెళ్లి సిద్ధార్థ్ తప్పుగా “స్పెర్మ్ డొనేట్” చేయాలనుకుంటాడు. అతను తన పేరును జేమ్స్ అని చెప్పి తప్పు అడ్రెస్ ఇవ్వడం. అలాగే శ్రియ తన బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంతో కథ సాగుతుంది. ఈ సినిమా జీవితంలో కొన్ని విలువల గురించి మాట్లాడుతుంది. కొంతమంది వ్యక్తులు తన అభిప్రాయాలు మార్చుకోరు మరికొంతమంది అవసరం, అవకాశం బట్టి మారుతారు.
ఈ రెండు వర్గాల మధ్య పొంతన కుదరకపోవడంతో వారు తమకు తగిన వ్యక్తిని ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో శ్రియ మరియు సిద్ధార్థ్ ప్రయాణం సాగుతుంది. ప్రేమ అంటే ఒకరికి తప్పులు తెలిసినా వారి నిజాయితీని గౌరవించాలి. ఈ అంశాన్ని ఈ కథ స్పష్టం చేస్తుంది. ఈ సినిమా హీరో-హీరోయిన్ల మధ్యకే ప్రధానంగా సాగుతుంది.మిగతా పాత్రలు చాలా సున్నితంగా తెరపైకి వస్తాయి నిత్యామీనన్ పాత్రకే ప్రధాన ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.