click here for more news about Madharasi
Madharasi తమిళ సినిమా ఇండస్ట్రీలో శివకార్తికేయన్ మరో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు సాయిపల్లవి తో కలిసి నటించిన ‘అమరన్’ మూవీ అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది.ఈ విజయం తర్వాత శివకార్తికేయన్ తన కెరీరులోనే మరో అద్భుత ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. శివకార్తికేయన్ తాజాగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో కలిసి తన కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఈ చిత్రానికి ‘ఎస్‌కే 23’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఉంచారు. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు, అది శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల చేయడం విశేషం.ఈ గ్లింప్స్ ద్వారా సినిమా టైటిల్ కూడా బయటపెట్టారు ‘మదరాసి’ అనే సుదీర్ఘ, పవర్‌ఫుల్ టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘లక్ష్మి మూవీస్’ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్ కొత్త భయంకరమైన లుక్ లో కనిపించారు.ఈ గ్లింప్స్‌లో ఆయన కనిపించిన లుక్ చాలావరకు అభిమానులను ఆకట్టుకుంది.సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామోన్ ఆ visualsతో సినిమాను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆఫిషియల్ మ్యూజిక్ బీజీఎం అనిరుధ్ రవిచంద్రన్ అందించడం, ఈ చిత్రానికి మరింత మాస్ అట్రాక్షన్ తీసుకురాగలుగుతుంది. ఈ చిత్రంలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంతన్ కథానాయికగా కనిపిస్తారు. ఇన్నోసెంట్‌గా ఉండే ఆమె పాత్ర ఈ కథలో కీలకమైనది.
అలాగే విద్యుత్ జమాల్, బీజు మీనన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. మొత్తానికి, ‘మదరాసి‘ చిత్రం పై ప్రేక్షకుల నుంచి భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా రిలీజ్ సమయానికి మరింత హిట్ అవ్వాలని ఆశిస్తున్న అభిమానులు, కేవలం కథే కాదు, విజువల్స్, సంగీతం, యాక్షన్ సన్నివేశాలు కూడా ఓ కొత్త ఉత్కంఠను సృష్టించేలా ఉన్నాయి. ఈ కొత్త ప్రాజెక్టు, శివకార్తికేయన్ కెరీర్‌లో మరో అత్యుత్తమ జోరును అందించడమే కాకుండా, తమిళ సినిమా అభిమానుల్ని మరింత ఆకట్టుకునేలా ఉండబోతుంది.