Click Here For More News About Kannappa movie
Kannappa movie :- డైనమిక్ హీరో విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయనున్నాడు. ఈ సినిమా అవా ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డా. మంచు మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు దర్శకత్వం కొద్దీ ముఖేశ్ కుమార్ సింగ్ చేస్తున్నారు. ‘కన్నప్ప’ మూవీ ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
![కన్నప్ప సినిమా నుంచి శివా శంకర పాట విడుదల](https://thevaartha.com/wp-content/uploads/2025/02/కన్నప్ప-సినిమా-నుంచి-శివా-శంకర-పాట-విడుదల-1.jpg)
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు మరింత వేగంగా సాగుతున్నాయి.మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘కన్నప్ప’ టీం ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేసింది.బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ చేతుల మీద ఈ పాటను ఆవిష్కరించారు.ఈ ప్రత్యేక వేడుకలో మోహన్ బాబు, మంచు విష్ణు, దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్, కన్నడ డిస్ట్రిబ్యూటర్ రాక్‌లైన్ వెంకటేశ్, నటి సుమలత, భారతి విష్ణువర్ధన్, సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ, నటుడు అర్పిత్ రాంకా, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా, శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ కన్నప్ప బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘కన్నప్ప’ టీం తెలిపిన ప్రకారం, “ఈ చిత్రం భక్తి, ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. మా మొదటి పాటను శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆవిష్కరించడం మా అదృష్టం” అని చెప్పారు. దర్శకుడు మోహన్ బాబు మాట్లాడుతూ, “శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఈ పవిత్ర గీతాన్ని ఆవిష్కరించడం మా కోసం గౌరవంగా భావిస్తున్నాను. ‘కన్నప్ప’ చిత్రం శివునితో గాఢమైన అనుబంధాన్ని చూపించేందుకు రూపొందించబడింది. ఇది మా ప్రయాణానికి ఎంతో ఆధ్యాత్మిక విలువను జోడిస్తుంది” అని చెప్పారు.ఈ పాట ‘శివా శివా శంకరా‘ని విజయ్ ప్రకాష్ ఆలపించారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందించగా రామజోగయ్య శాస్త్రి పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు ప్రభుదేవా కొరియోగ్రఫీ పాటను మరింత అర్థవంతంగా మార్చింది.