click here for more news about AP Minister Savitha
AP Minister Savitha ఐదు సంస్థలు ముందుకు వచ్చాయి. చేనేత రంగంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడుల పెట్టడానికి ఈ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. త్వరలో ఆ సంస్థలతో ఎంవోయూలు (ఎగ్జిక్యూటివ్ మెమోరాండు ఆఫ్ అండర్‌స్టాండింగ్) చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఈ పెట్టుబడులతో 15,000 మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి.న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్‌లో మంత్రి సవిత సోమవారం రెండో రోజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మంత్రి వివిధ దేశాల, విదేశీ పెట్టుబడుదారులతో సమావేశమయ్యారు. అడ్వాన్స్ టెక్స్ టైల్స్ అసోసియేషన్, ఐటీఎంఎఫ్, మాస్కో ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈ సందర్భంగా కర్ణాటకకు చెందిన ప్రతినిధులు కూడా ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపినట్లు మంత్రి తెలిపారు.ఇంకా రష్యాలో టెక్స్ టైల్స్ వేర్ హౌస్ ఏర్పాటు చేయడానికి గుంటూరు టెక్స్ టైల్స్ పార్క్ అంగీకారం తెలిపిందని సవిత చెప్పారు.భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్ ఈ నెల 14వ తేదీ నుంచి నలుగురు రోజులు విజయవంతంగా జరిగినట్లు మంత్రి చెప్పారు.
“ఖాదీ ఈజ్ ఎ నేషన్ ఖాదీ ఈజ్ బీకమింగ్ ఫ్యాషన్” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని అన్నారు.ఈ స్ఫూర్తితో, త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో చేనేత పరిశ్రమలో పెట్టుబడులు పెడితే, దీనికి సంబంధించి సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. పెట్టుబడులు పెట్టేవారికి అనుకూల వాతావరణం కల్పించడం, సుస్థిర పాలనతో పాటు రాయితీలు మరియు సౌకర్యాలు అందించడం అనే నిబద్ధతతో ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సదస్సు ఏర్పాటు అవుతుంది.