click here for more news about Andhra Pradesh-6
Andhra Pradesh-6 రేపు (మార్చి 1) ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన చేపట్టనున్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంటకు గంగాధర నెల్లూరు మండలంలోని రామానాయుడుపల్లె గ్రామంలో చేరుకుని పర్యటించనున్నారు. ఈ గ్రామంలో పర్యటించిన అనంతరం పలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందిస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్తులకు సంక్షేమ పథకాలను మరింత చేరువగా అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారు. అలాగే, గ్రామంలో “10 సూత్రాల కాన్సెప్ట్” ఆధారంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం పరిశీలించనున్నారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివిధ సంక్షేమ కార్యక్రమాల వివరాలు అందించడం ప్రజల సమస్యలను సునాయాసంగా పరిష్కరించడం లక్ష్యంగా ఉంటుంది.అంతేకాకుండా గ్రామంలో ప్రజావేదిక సభలో పాల్గొని అక్కడి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడతారు.
ప్రజలతో సమీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన సూచనలూ అందించనున్నారు.ఇంకా స్థానిక టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించి, వారికి దిశానిర్దేశం చేయనున్నారు.ఈ సమావేశం ద్వారా పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం అభివృద్ధి కార్యాలయాలకు సంబంధించి ప్రణాళికలను రూపొందించడం ప్రధాన ఉద్దేశం.సాయంత్రం 3.55 గంటలకు, రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం, అక్కడ నుండి తిరిగి అమరావతికి బయలుదేరతారు.