International News:కేంద్ర బడ్జెట్; మధ్యతరగతులకు భారీ ఊరట

International News

click here for more news about International News

International News కేంద్ర బడ్జెట్ 2025 లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఎనిమిదోసారి ప్రవేశపెట్టారు “దేశమంటే మట్టికాదు, దేశమంటే మనుషులే” అని ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ఈసారి వ్యవసాయం, MSME, ఎగుమతులు, పెట్టుబడులు, తదితర రంగాల్లో కీలకమైన మార్పులు చేర్చారు. నిర్మలా వికసిత భారత్ లక్ష్యంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌ను భూ రికార్డుల డిజిటలైజేషన్‌ను ప్రాధాన్యంగా తీసుకున్నారు. తద్వారా దేశం ముందుకు సాగేందుకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కేటాయించారు. హోమ్‌ స్టే ప్రారంభించేవారికి ప్రభుత్వం రుణాలు అందించేందుకు కూడా బడ్జెట్‌లో ప్రత్యేకం ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఈ ప్రక్రియకు నూతన రుణాలపై ఆర్థిక సాయం అందించి ప్రజలకు మరింత అంగీకారాన్ని పొందేలా చేయనున్నారు.

ఇక IIT, IIScలో 10,000 కొత్త ఫెలోషిప్‌లు అందజేయడం కూడా బడ్జెట్‌లో కీలక భాగంగా నిలిచింది.ఇక తోలు పరిశ్రమలకు, బొమ్మల రంగానికి కూడా ప్రోత్సాహం ఇచ్చారు. దేశవ్యాప్తంగా మేకిన్ ఇండియా ఉత్సాహాన్ని పెంచేందుకు జాతీయ స్థాయి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు నిధులు కేటాయించడం విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత మంచి అవకాశాలను అందించేలా మార్పులు తీసుకున్నారు.అంతేకాకుండా, సంస్కరణలు చేపడుతున్న రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించనున్నారు.నగర అభివృద్ధి కోసం “అర్బన్ ఛాలెంజ్ ఫండ్” ప్రారంభించనున్నారు. అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడానికి కొత్త ప్రణాళికలను కూడా ప్రకటించారు.

ఈ బడ్జెట్‌లో, మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా భారీ నిధులు కేటాయించి, దేశ అభివృద్ధి దిశగా పెద్దపీట వేసారు. పలు రంగాల్లో సంస్కరణలతో దేశం సమగ్రాభివృద్ధి వైపు దూసుకెళ్లేలా నిర్మలాసీతారామన్ ప్రణాళికలు రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd kota batam. A collection of product reviews. The nation digest.