WPL 2025 GGW vs UPWW:యూపీని చిత్తు చేసిన గుజరాత్

WPL 2025 GGW vs UPWW

click here for more news about WPL 2025 GGW vs UPWW

WPL 2025 GGW vs UPWW 2025 మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ తన తొలి విజయం సాధించింది.ఆదివారం రాత్రి (ఫిబ్రవరి 16) జరిగిన మ్యాచ్‌లో, గుజరాత్ జెయింట్స్ యూపీ వారియర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.గుజరాత్ జెయింట్స్ మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది, కానీ ఈసారి ఆ జట్టు అదరగొట్టింది.మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 144 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే గుజరాత్ జెయింట్స్ 12 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఈ టార్గెట్‌ను ఛేదించుకుంది.

18 ఓవర్లలో గుజరాత్ 4 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసి విజయం సాధించింది.ఈ మ్యాచ్ వడోదరలోని కోటంబి స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగింది. గుజరాత్ జెయింట్స్ ప్రారంభ నుంచి స్పష్టమైన ఆధిపత్యం చూపింది.ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్‌కు ఈ టోర్నీలోని తొలి విజయం దక్కింది. ముందు ఫిబ్రవరి 14న బెంగళూరు చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన గుజరాత్ జెయింట్స్, ఈ మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శనతో గెలిచింది. లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు మొదట శుభారంభం లభించలేదు.బెత్ మూనీ, దయాళన్ హేమలత ఇద్దరూ డకౌట్ అయ్యారు.

అయితే, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి గుజరాత్ జెయింట్స్‌ను గెలిపించారు. కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.లారా వోల్వార్డ్ 22 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ మరియు డిఆండ్రా డాటిన్ ఐదో వికెట్‌కు 58 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హర్లీన్ 30 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. డిఆండ్రా డాటిన్ 18 బంతుల్లో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.యూపీ తరఫున సోఫీ ఎక్లెస్టోన్ 2 వికెట్లు తీసింది. గ్రేస్ హారిస్, తహిలా మెక్‌గ్రాత్ ఇద్దరూ చెరో వికెట్ తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sementara itu, wahyudi mengucapkan terima kasih atas sambutan ketua dan sekretaris dprd kota batam. Which sports betting app is best ?. The nation digest.