BEAUTY ‘బ్యూటీ’ టీజర్ విడుదల

BEAUTY

click here for more news about BEAUTY

BEAUTY వానరా సెల్యులాయిడ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.త్వరలోనే మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బారిక్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అంతేకాదు, లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచే మరో చిత్రంగా ‘బ్యూటీ’ మూవీని మారుతి టీం ప్రొడక్ట్‌తో కలిసి నిర్మిస్తోంది.ఈ సినిమా జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు.నిర్మాతలుగా అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ వ్యవహరిస్తున్నారు. హీరోగా అంకిత్ కొయ్య, హీరోయిన్‌గా నీలఖి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.బి.ఎస్. రావు ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. వాలెంటైన్ డే సందర్భంగా విడుదల చేసిన ‘బ్యూటీ‘ టీజర్ మరింతగా ఆకర్షణీయంగా మారింది. ఈ టీజర్‌లో అందమైన ప్రేమకథతో పాటు మిడిల్ క్లాస్ ఎమోషన్లను హృద్యంగా చూపించారు.అంకిత్ కొయ్య, నీలఖి నటన ఆకట్టుకోగా, నరేష్ తండ్రిగా,వాసుకి తల్లిగా కనిపించనున్నారు.టీజర్‌ను గమనిస్తే, కథ ప్రధానంగా ఓ స్కూటీ చుట్టూ తిరిగేలా కనిపిస్తోంది. స్కూటీ కథలోకి ఎలా వస్తుంది? హీరోయిన్ స్కూటీని ఎందుకు అడుగుతోంది? ఆ స్కూటీ వచ్చిన తర్వాత కథలో ఎలాంటి మార్పులు వస్తాయి?

వంటి ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి.టీజర్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘లైఫ్‌లో నిన్ను ఇంకేం అడగను’ అనే డైలాగ్‌కు సినిమాలో ప్రాధాన్యత ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సినిమాకు శ్రీ సాయి కుమార్ విజువల్స్ అందించగా, విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.ఎడిటర్‌గా ఎస్‌బి ఉద్ధవ్, ఆర్ట్ డైరెక్టర్‌గా బేబీ సురేష్ భీమగాని పని చేస్తున్నారు.నటీనటులు:అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా తదితరులు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The nation digest. Dprd kota batam. Live : us pauses new funding for nearly all us aid programs worldwide.