తైవాన్ అధికారుల బృందంతో మంత్రి నారా లోకేష్ భేటీ

తైవాన్ అధికారుల బృందంతో మంత్రి నారా లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ ఫుట్‌వేర్ రంగాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తైవాన్ సహకారం కోరినట్లు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆయన తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ (చెన్నై) డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్‌తో జరిగిన చర్చలలో ఈ విషయాన్ని వెల్లడించారు.తైవాన్ ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాలలో ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది. ఈ రంగాల్లో తైవాన్ తీసుకొచ్చిన పాలసీలు, వాటి అమలుకు సంబంధించి నారా లోకేశ్ వివిధ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రంగాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అందించే సహకారం, అనుమతులు, మరియు ఉత్పత్తి ప్రారంభం వరకు జరుగుతున్న చర్యలు గురించి కూడా మంత్రి లోకేశ్ వివరించారు.

ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ పద్ధతిని అవలంబిస్తూ కంపెనీల స్థాపనకు అనుకూలమైన చర్యలు తీసుకుంటుందని, 2014-19 మధ్య తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లను,అక్కడ ఏర్పడిన అనేక కంపెనీలను, యువతకు వచ్చిన ఉద్యోగ అవకాశాలను నారా లోకేశ్ తైవాన్ బృందానికి వివరించారు.

ఎలక్ట్రానిక్స్,టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాలలో భారీ స్థాయిలో అవకాశాలు ఉన్నాయని మంత్రి లోకేశ్ అన్నారు.ఈ రంగాలు లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టించగలవు.ఈ రంగాలను ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కట్టుబడింది.తైవాన్‌కు చెందిన అనేక కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సహకరించాలని నారా లోకేశ్ అభ్యర్థించారు. అలాగే, ఈ కంపెనీలు సులభంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాలలో ప్రత్యేక పార్కులను ఏర్పాటుచేసే విషయంలో తైవాన్ సహకారం కోరుతూ, మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ రంగాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తైవాన్ బృందం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Otc market news. You can’t stop advising govt – hikima tells emir sanusi. © 2023 24 axo news.