click here for more news about 2025 Champions Trophy
2025 Champions Trophy భారత జట్టు ఈ రోజు బంగ్లాదేశ్‌తో దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ పోరును ప్రారంభించనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలో భారత జట్టు బంగ్లాదేశ్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్‌గా కనపడుతోంది. గత రికార్డుల ప్రకారం ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరిట్‌గా కనిపిస్తుంది.అయినా బంగ్లా టైగర్స్‌ను తక్కువ అంచనా వేయడం సరికాదు అని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. ఈరోజు రోహిత్ 12 పరుగులు చేయగలిగితే వన్డేల్లో 11,000 పరుగుల మార్క్‌ను అధిగమించేందుకు అవకాశం ఉంది.
2007లో భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఇప్పటివరకు 10,988 పరుగులు చేశాడు.వన్డేల్లో 11,000 పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉంటాడు.ఈ మైలురాయిని అందుకుంటే అతను కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా 11,000 వన్డే పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులో చోటు సాధిస్తాడు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే, అతను రెండు ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్లలో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసే మొదటి ఆటగాడిగా అవతరిస్తాడు.ప్రస్తుతం రోహిత్ శర్మ 49 సెంచరీలు సాధించారు. ఈరోజు మరొక సెంచరీ చేస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు చేసిన మూడో భారతీయ ఆటగాడిగా రోహిత్ గుర్తింపు పొందుతాడు.
రోహిత్ శర్మకు ఈ మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు కూడా ఊరిస్తోంది. భారత మాజీ కెప్టెన్లు మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ తర్వాత 100 అంతర్జాతీయ మ్యాచ్‌లను గెలిచిన నాలుగో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ అవతరిస్తాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ 137 మ్యాచ్‌లలో 99 విజయాలు సాధించారు.రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో 14 సిక్సర్లను బాదితే, వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలుస్తాడు. ప్రస్తుతం షాహిద్ అఫ్రిదీ 351 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నారు.