భారత జట్టులో సంచలన మార్పులు: ఛాంపియన్స్ ట్రోఫీకి 18 మంది సభ్యుల జట్టు ప్రకటించింది.వీరిలో 15 మంది ప్రధాన జట్టుతో బయలుదేరుతారు మిగిలిన 3 మంది ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉంటారు.అంటే ఈ ముగ్గురు ఆటగాళ్లు భారతదేశంలోనే ఉంటారు. భారత జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఇద్దరు ఆటగాళ్లు తప్పించారు. ఫిట్‌నెస్ సమస్యలతో జస్‌ప్రీత్ బుమ్రాను జట్టులో నుంచి తొలగించారు.వెన్నునొప్పి కారణంగా బుమ్రా టోర్నీకి దూరమయ్యారు.
![భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సిరాజ్ మియా](https://thevaartha.com/wp-content/uploads/2025/02/భారత-జట్టులోకి-రీఎంట్రీ-ఇచ్చిన-సిరాజ్-మియా-1-1024x683.webp)
బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు.అలాగే యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను కూడా జట్టులోంచి తొలగించి,అతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు.ఈ మార్పులతో పాటు మరికొంతమంది ఆటగాళ్లను రిజర్వ్ జాబితాలో చేర్చారు మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్,శివం దూబే ఇలా ముగ్గురు ఆటగాళ్లు రిజర్వ్ జాబితాలో చేరారు.ఈ ముగ్గురు ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీం ఇండియాతో ప్రయాణించరు.వారు భారత్‌లోనే ఉంటారు అవసరమైతే ఈ రిజర్వ్ ప్లేయర్లు దుబాయ్ చేరుకోవచ్చు.ఇది ఒక పెద్ద పరిణామం ఎందుకంటే మహ్మద్ సిరాజ్ గత కొన్ని సంవత్సరాలుగా భారత జట్టులో స్థిరమైన సభ్యుడిగా ఉన్నాడు. కానీ ఈసారి అతను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు సంపాదించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది.ఈ సవరించిన జట్టు ఇప్పుడు దుబాయ్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి తయారైంది. భారత జట్టు ప్రపంచ క్రికెట్‌లో దృఢమైన ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది, కానీ కొన్ని కీలక మార్పులతో కూడిన ఈ జట్టు మరింత ఆసక్తికరంగా మారింది.