ట్రోపీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్

ట్రోపీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్

చాంపియన్స్ ట్రోఫీ ముందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి కెప్టెన్ పాట్ కమిన్స్ సహా పేస్ దిగ్గజాలు మిచెల్ స్టార్క్ జోష్ హేజెల్‌వుడ్ జట్టుకు దూరమయ్యారు. కమిన్స్ హేజెల్‌వుడ్ గాయాలతో బాధపడుతుండగా స్టార్క్ మాత్రం వ్యక్తిగత కారణాలతో జట్టులో చేరలేదు. ఈ పరిస్థితిలో స్టీవెన్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. ఆయన సీనియర్ ఆటగాడిగా తన అనుభవంతో జట్టును పటిష్టంగా నడిపించగలడు.స్మిత్ ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ రెండు మ్యాచ్‌లలోనూ అతను జట్టును విజయం వైపుగా నడిపించాడు.

కానీ ఆసీస్ జట్టులో మరిన్ని అంతర్గత సవాళ్లు ఉన్నాయి మార్కస్ స్టోయినిస్ ఇటీవల వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు అలాగే గాయంతో బాధపడుతున్న మిచెల్ మార్ష్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు చాంపియన్స్ ట్రోఫీకి కొత్త చెలామణి చేయాల్సి ఉంది.ఆస్ట్రేలియా చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ “గాయాల కారణంగా జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

అయితే, మా జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు చాలామంది ఉన్నారు, వారు చాంపియన్స్ ట్రోఫీ విజయానికి బలమైన బలమై నిలుస్తారు,” అని చెప్పారు.ప్రత్యర్థి బలాన్ని అలాగే అక్కడి పరిస్థితుల్ని బట్టి జట్టు సెట్టింగ్‌లో ఎన్నో ఆప్షన్లు ఉన్నాయనీ ఆయన అన్నారు.స్టార్క్ దూరమవడం ఆస్ట్రేలియా జట్టుకు నష్టమే అయినా బెయిలీ మాత్రం అతడి స్థానంలో కొత్త ఆటగాడు తన శక్తిని చూపే అవకాశాన్ని పొందుతాడని చెప్పారు. అలాగే ఈ రోజు నుండి శ్రీలంకతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లోనూ స్టార్క్ జట్టులో చేరలేదు.చాంపియన్స్ ట్రోఫీ 8 దేశాలు పోటీ పడనున్న ఈ టోర్నీ పాకిస్థాన్ వేదికగా జరుగుతుంది, కానీ భారత్ ఆడే మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతాయి. ఈ టోర్నీ ఈ నెల 19న ప్రారంభం కానుంది మరియు మార్చి 9న ముగియనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Otc market news. The nation digest. ‘hellboy’ creator launches new macabre world in ‘bowling with corpses’ axo news.