ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు

ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిరుద్యోగుల‌కు ఒక మంచి వార్త చెప్పింది రాష్ట్రంలోని 16,247 టీచర్ పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నియామక ప్రక్రియను జూన్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జీఓ 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని కూడా అధికారులు పేర్కొన్నారు.గతంలో టీచర్ల కోసం 45 రకాల యాప్స్ ఉండేవి. వాటన్నింటిని ఒకే యాప్‌గా సమకూర్చి, టీచర్ల కోసం మరింత సౌకర్యవంతంగా మార్చామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అలాగే త్వరలో టీచర్ల బదిలీల చట్టం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ విషయం ప్ర‌భుత్వానికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు.

ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు

వ‌చ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు పాస్ చేస్తామని చెప్పారు ఇక వీసీ నియామకం పూర్తయ్యాక, అన్ని విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని తెలిపారు.మార్చిలో విడుదల చేయనున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విషయంలో విద్యాశాఖ అన్ని న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ 16,247 పోస్టుల్లో, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ)- 6,371, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)- 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ)- 286, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ)- 132, ప్రిన్సిపల్స్- 52 పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Otc market news. Fg unveils free ai academy for nigerian youths the nation digest. © 2023 24 axo news.