అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో టర్మ్‌లో కొన్ని విభిన్న నిర్ణయాలు తీసుకుంటున్నారు ఖర్చులను తగ్గించుకోవడానికి ఆయన ఎలాన్ మస్క్ నేతృత్వంలోని “డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ” (డోజ్) విభాగానికి మరిన్ని అధికారాలు కేటాయించారు. ఈ నిర్ణయంతో, అమెరికా ప్రభుత్వంలో పెద్దఎత్తున ఉద్యోగాల కోతలు ఉండనున్నాయి. ట్రంప్ ప్రభుత్వం అనవసర ఉద్యోగాల తొలగింపు ద్వారా లక్ష కోట్ల డాలర్ల మేర పొదుపు చేయగలమని ప్రకటించింది.అమెరికా ఏజెన్సీలు, ఉద్యోగాల కోతలు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని ట్రంప్ ఆదేశించారు.ఈ కోతల గురించి ఎలాన్ మస్క్‌తో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. డోజ్ సహకారం సంప్రదింపుల అనంతరం ఉద్యోగుల తొలగింపు,నియామకాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. తొలగించగల ఉద్యోగులను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో పేర్కొన్నారు.
అలాగే, ట్రంప్, డోజ్ పనితీరును ప్రశంసించారు.అయితే కొన్ని ముఖ్యమైన విభాగాలకు మినహాయింపులు ఉన్నాయి.లా ఎన్‌ఫోర్స్‌మెంట్, నేషనల్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ విభాగాలు ఈ కోతలకు భద్రతగా ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు.ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసే ముందు, ఎలాన్ మస్క్ ట్రంప్ పక్కన నిలిచారు. “మేక్ అమెరికా గ్రేట్ అగేన్” అనే క్యాప్ ధరించిన మస్క్, తన కుమారుడితో మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.మస్క్ మాట్లాడుతూ “ప్రజలు భారీ ప్రభుత్వ సంస్కరణల కోసం ఓటు వేశారు. ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నాం ప్రభుత్వ వ్యర్థాలను తగ్గించకపోతే,అమెరికా దివాలా తీస్తుంది” అని పేర్కొన్నారు.
అలాగే 1 ట్రిలియన్ డాలర్ల పొదుపు గురించి కూడా చెప్పారు.ఇది మొత్తం ఫెడరల్ వ్యయానికి దాదాపు 15% అని చెప్పారు.అమెరికాలో పోస్టల్ సేవలు మినహాయించి, 23 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.వీరంతా వివిధ ఏజెన్సీలలో పనిచేస్తున్నారు ట్రంప్ ఉద్యోగాల సంఖ్యను తగ్గించేందుకు బైఅవుట్ ప్యాకేజీ ప్రకటించారు.స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలిన వారికి 8 నెలల జీతం ఇస్తామని చెప్పారు అయితే ఈ ఆఫర్‌పై ఫెడరల్ కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది.