అమెరికా దేశంలో అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ చర్యల భాగంగా అమెరికా ఇటీవల 104 మంది భారతీయులను స్వదేశం పంపించింది. తాజా సమాచారం ప్రకారం, మరో రెండు విమానాల్లో భారతీయులను స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు (15వ తేదీ) వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది ఉండనున్నట్లు సమాచారం. మరుసటి విమానంలో మరికొంతమంది భారతీయులను కూడా అమెరికా తరలించనుంది.భారత విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అమెరికా బహిష్కరణ జాబితాలో మరో 487 మంది భారతీయులు ఉన్నారు. వీరిని కూడా త్వరలో స్వదేశానికి పంపించనున్నట్లు తెలుస్తోంది.ఈ మొత్తం చర్యలపై పంజాబ్ రాష్ట్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమృత్‌సర్‌లో అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలను ల్యాండ్ చేయడం పంజాబ్‌కు అసహ్యంగా ఉంది. పంజాబ్ ప్రభుత్వం, కేంద్రం ఈ చర్యలతో రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడింది.పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా, ఈ విమానాలను హర్యానా, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు. ఆయన, “పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకోవడమేంటి?” అని అన్నారు.ఇంకా, పంజాబ్ ప్రభుత్వం, ఇకపై వచ్చే విమానాలు అహ్మదాబాద్‌లో ల్యాండ్ చేయాలని డిమాండ్ చేసింది. వీటి ద్వారా తమ రాష్ట్రం ప్రతిష్టను కాపాడాలని వారు కోరుతున్నారు.అమెరికా ప్రకటనలు, పంజాబ్ ప్రభుత్వ ప్రతిస్పందనాలు, ఈ చర్యల పై ఉత్కంఠ పెరిగింది.