విపక్షాల నిరసనల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్

విపక్షాల నిరసనల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్

కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పరిణామంతో విపక్షాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ లోక్‌సభ నుండి వాకౌట్ చేశాయి ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం చాలా పాతది దశాబ్దాలుగా ఉన్న ఈ చట్టాన్ని కడదీసి, కొత్త చట్టం తీసుకొరావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ కొత్త చట్టం ఆదాయపు పన్ను నూతన బిల్లు-2025గా పేరుపొందింది 1961లో రూపొందించిన పాత ఆదాయపు పన్ను చట్టం అనేక సవరణలను ఎదుర్కొంది.

దీంతో అది చాలా సంక్లిష్టంగా మారింది పన్ను చెల్లింపుదారులకు పన్ను చెల్లింపు ప్రక్రియ ఎక్కువ ఖర్చులను కలిగిస్తోంది.ఈ దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని సమీక్షించి సరళతరం చేస్తామని 2024 జులై బడ్జెట్‌లో పేర్కొన్నది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత విపక్షాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అప్పటికే కొన్ని గంటల్లో లోక్‌సభను మార్చి 10న వాయిదా వేసింది.

ఈ కొత్త చట్టం ద్వారా పన్ను చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయడం పన్ను చెల్లింపుదారులపై ఉన్న భారం తగ్గించడం లక్ష్యంగా కేంద్రం ఈ బిల్లును రూపొందించింది.పాత చట్టం అనేక సవరణలు కారణంగా నేటికీ అమలులో ఉన్నది దీంతో పన్ను చెల్లింపుదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ కొత్త చట్టం తెస్తున్న మార్పులు వలన పన్ను చెల్లింపుదారులకు ముఖ్యంగా మధ్య తరగతికి, మరింత ప్రయోజనకరమైనది కావచ్చు. పన్ను విధానంలో తేలికపాటు మరింత స్పష్టత కూడా రాబోతోందని అంచనా వేస్తున్నారు. ఇంతటి పెద్ద మార్పు అంతటి పెద్ద చట్టం కావడంతో దీనిపై విపక్షాలు ఇంకా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు వీటికి సంబంధించిన చర్చలు అవగాహనలు ఇంకా కొనసాగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Otc market news. The nation digest. S and the world axo news.