లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివాదాస్పదం

లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివాదాస్పదం

కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ‘లైలా’ సినిమాకు సంబంధించి కొన్ని వివాదాలను తలెత్తించాయి. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వైసీపీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి చేశాయి. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో ‘లైలా’ సినిమా హీరో విష్వక్సేన్ చిత్ర నిర్మాత సాహు గారపాటి స్పందించి ఈ సంఘటనకి క్షమాపణలు చెప్పారు.అయితే ఆ క్షమాపణలు చేసినా ‘బాయ్ కాట్ లైలా’ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ విషయంపై విష్వక్సేన్ మరోసారి స్పందించారు. “నేను ఎప్పుడూ తగ్గాను.

లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివాదాస్పదం
లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివాదాస్పదం

ఆ ప్రీరిలీజ్ ఈవెంట్ లో జరిగిన దానికి క్షమాపణలు చెప్పాను ఇప్పటి వరకు జరిగినదంతా అనవసరంగా ఎక్కువగా ఆలోచించకండి ప్రశాంతంగా ఉండండి” అని విష్వక్సేన్ ట్వీట్ చేశారు.తదుపరి “నేను ఒక నటుడిని మాత్రమే. నన్ను నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు రాజకీయాలను వేరే వాళ్ళు చేస్తారు. నా పని సినిమాలు నా ప్రదర్శన మాత్రమే” అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.ఈ సంఘటనతో ‘లైలా’ సినిమాకు సంబంధించిన వివాదం మరో రేంజ్ లో వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో ఈ అంశంపై ముచ్చట్లు కొనసాగుతున్నాయి. పృథ్వీ చేసిన వ్యాఖ్యలు, విష్వక్సేన్ స్పందన, అవి సినిమా ప్రదర్శనకు ప్రభావం చూపిస్తాయా అనే అంశం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Otc market news. Court bars frsc from arresting vehicles with faded number plate the nation digest. S and the world axo news.