భారత జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

భారత జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలో ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు నివాళి అర్పించారు. మెజార్గ్విస్ మిలిటరీ శ్మశాన వాటిక వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా భారత జవాన్లకు నివాళులు అర్పించారు. మోదీ తన పర్యటనలో ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించారు. మాసేలో భారత కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ “మాసేలోని భారత కాన్సులేట్ భారత-ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలపరుస్తుందని” అభిప్రాయపడ్డారు. ఈ కాన్సులేట్, రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది అని ఆయన పేర్కొన్నారు.

భారత జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
భారత జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

మోదీ మాట్లాడుతూ “ఈ కాన్సులేట్ ద్వారా మనం మున్ముందు మరింత సమర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకుంటాం. ఇది రెండు దేశాల మధ్య మరింత దృఢమైన భాగస్వామ్యానికి మూలంగా నిలుస్తుంది” అని అన్నారు. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా పాల్గొన్నారు. భారత్-ఫ్రాన్స్ మధ్య వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలపర్చేందుకు ఈ కాన్సులేట్ ఒక ప్రధాన కృషి చేయనుంది. ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన ద్వారా భారత్, ఫ్రాన్స్ సంబంధాలను మరింత గాఢత పెట్టడంలో కీలకమైన ప్రయత్నాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Otc market news. Rivers : gov fubara, wike, stakeholders meet president tinubu over rivers issues. Auto matters axo news.